జేఈఈ మెయిన్-2023 తుది విడత పరీక్షలు గురువారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9.40 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు. దేశంలో మొత్తం 330 నగరాల్లో, విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
కాగా గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్-2023కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక తుది విడత జేఈఈ మెయిన్ పరీక్షకు 9.40 లక్షల మందిల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే తొలిసారి కంటే మలిసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. ఈ రెండు సెషన్లలో వచ్చిన మార్కుల్లో బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకును కేటాయిస్తారు. రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి ర్యాంకులను ప్రకటిస్తారు. వీరిలో తొలి రెండున్నర లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జూన్ 4న జరగనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.