ITBP Recruitment: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Jun 07, 2022 | 8:15 AM

ITBP Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

ITBP Recruitment: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Itbp Recruitment
Follow us on

ITBP Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ / స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ ఎంట్రీ) 21, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్/స్టెనోగ్రాఫర్ (ఎల్డీసీఈ) 17 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్‌, సీనియర్ సెకండరీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 100 చెల్లించాలి.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 08-06-2022న మొదలై 07-07-2022తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..