ITBP Recruitment 2022: ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం..పదో తరగతి అర్హత..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP).. 103 కానిస్టేబుల్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

ITBP Recruitment 2022: ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం..పదో తరగతి అర్హత..

Updated on: Aug 18, 2022 | 3:06 PM

ITBP Constable (Pioneer) Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ITBP).. 103 కానిస్టేబుల్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. పదో తరగతి లేదా తత్సమానం కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. కానిస్టేబుల్ (కార్పెంటర్) పోస్టులు 56, కానిస్టేబుల్ (మేసన్) పోస్టులు 31, కానిస్టేబుల్ (ప్లంబర్) పోస్టులు 21 వరకు ఉన్నాయి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 17, 2022 నాటికి 18 నుంచి 23 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో రేపట్నుంచి (ఆగస్టు 19, 2022) సెప్టెంబర్‌ 17, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.