AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs: ఫ్రెషర్స్ కి పండగలాంటి వార్త.. కాలేజీలకు క్యూ కడుతోన్న ఐటీ కంపెనీలు.

అయితే తాజాగా ఐటీ రంగానికి పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కంపెనీలు పెద్ద ఎత్తున ఫ్రెషర్స్ ని నియమించుకుంటున్నాయి. కాలేజీలకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపించడంతో కంపెనీలు నియామకాలపై దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి...

Jobs: ఫ్రెషర్స్ కి పండగలాంటి వార్త.. కాలేజీలకు క్యూ కడుతోన్న ఐటీ కంపెనీలు.
Campus Placement
Narender Vaitla
|

Updated on: Sep 22, 2024 | 4:35 PM

Share

గత కొన్ని రోజులుగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ను భారీ ఎత్తున తగ్గించాయి. చివరికి ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీలు కూడా ఉద్యోగకల్పనలో జాప్యం చేశాయి. ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణ ఏదైనా గత కొన్ని రోజులుగా ఐటీరంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది.

అయితే తాజాగా ఐటీ రంగానికి పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కంపెనీలు పెద్ద ఎత్తున ఫ్రెషర్స్ ని నియమించుకుంటున్నాయి. కాలేజీలకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపించడంతో కంపెనీలు నియామకాలపై దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కంపెనీలు ఉద్యోగుల నియామకం విషయంలో సరికొత్త పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఒకప్పుడు ఫ్రెషర్స్ ని ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లుగా తీసుకునేవారు. అయితే మారిన పరిస్థితుల్లో నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వీరికి వేతనాలు ఎక్కువ ఇవ్వడానికి కూడా కంపెనీలు ముందుకొస్తున్నాయి.

దిగ్గజ ఐటీ సంస్థలైన.. టిసిఎస్, ఐబీఎం, ఎల్ టి ఐ మైండ్ ట్రీ వంటి సంస్థలు ఇప్పటికే క్యాంపస్ ల బాట పట్టాయి. టిసిఎస్ 40 వేల మంది ఫ్రెషర్స్ ని తీసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇక మరో దిగ్గజా ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ 15వేల నుంచి 20వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది.

విప్రో కూడా ఈ ఏడాది సుమారు 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకునే క్రమంలో కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్త కోసం క్లిక్ చేయండి..