IRCON Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఇర్కాన్‌లో 165 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..

|

Sep 14, 2022 | 3:14 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన 165 ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల (Project Scientist Posts) భర్తీకి..

IRCON Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఇర్కాన్‌లో 165 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
Ircon
Follow us on

IRCON New Delhi Project Scientist Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన 165 ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి అగ్రికల్చరల్‌ మెటీరియాలజీ/అగ్రికల్చరల్‌ ఫిజిక్స్‌/రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ GIS/మ్యాథమెటిక్స్‌/ఆట్మాస్పెరిక్‌ సైన్స్‌/ఎటక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 9, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.35,000ల నుంచి రూ.78,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ – III పోస్టులు:15
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ II పోస్టులు: 22
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ I పోస్టులు: 26
  • రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు: 34
  • JRF/SRF పోస్టులు: 68

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.