IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, వైర్‌మెన్, డ్రాఫ్ట్స్‌మెన్, మెకానిక్ (డీజిల్) వంటి తదితర విభాగాల్లో ఖాళీలను పూరింపనున్నారు. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 137
ఖాళీల వివరాలు:
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఈఏ): 58 పోస్ట్‌లు
టెక్నికల్ అటెండెంట్లు (టీఏ): 79 పోస్ట్‌లు
వయో పరిమితి: జనవరి 24, 2021 నాటికి అభ్యర్ధులకు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
పే స్కేల్: రూ. 23,000 – 78,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022.
రాత పరీక్ష తేదీ: మార్చి 27, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: