AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ (IOB)లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రాష్ట్ర స్థానిక భాషపై ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు..

నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు..
Indian Overseas Bank Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 09, 2026 | 8:40 AM

Share

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ (IOB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులను జేఎంజీఎస్‌-I (Scale-I) కేడర్‌లో భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను నాలుగు రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు.

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..

  • తమిళనాడులో పోస్టుల సంఖ్య: 100
  • గుజరాత్‌లో పోస్టుల సంఖ్య: 50
  • కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 50
  • మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 50

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థులు తాము దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థులు 10వ లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను చదవకపోతే, ఎంపిక ప్రక్రియలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1996 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 24, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనటరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో పలు దశలు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష (అవసరమైన వారికి) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూకు తుది ఎంపికలో 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతభత్యాలు అందిస్తారు. అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్ రాత పరీక్షలో మొత్తం 140 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్షకు 3 గంటల సమయం కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున కోత విధిస్తారు. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు 60 మార్కులు, జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు 40 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలు 60 మార్కులు, ఇంగ్లిష్ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలు 40 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us