Insurance jobs: నిరుద్యోగులకు ‘మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్’ గుడ్‌న్యూస్.. 23 వేల ఏజెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

|

Aug 02, 2021 | 5:19 AM

Max Life Insurance Jobs: దేశంలో ఇటీవల ఇన్సూరెన్స్ (బీమా) రంగం బాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఏజెంట్ల స్థాయి నుంచి పలు అధికారుల వరకూ నియమించుకుంటున్నాయి. బీమా రంగం పరుగులు పెడుతున్న తరుణంలో.. ఈ రంగంలో ఉద్యోగాల్లో

Insurance jobs: నిరుద్యోగులకు ‘మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్’ గుడ్‌న్యూస్.. 23 వేల ఏజెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Follow us on

Max Life Insurance Jobs: దేశంలో ఇటీవల ఇన్సూరెన్స్ (బీమా) రంగం బాగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఏజెంట్ల స్థాయి నుంచి పలు అధికారుల వరకూ నియమించుకుంటున్నాయి. బీమా రంగం పరుగులు పెడుతున్న తరుణంలో.. ఈ రంగంలో ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి తాజాగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ శుభవార్త చెప్పింది. ఏజెంట్ల స్థాయి అధికారుల కోసం భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు చేపడుతున్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ వెల్లడించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

డిజిటల్ రిక్రూట్‌మెంట్ ప్రయాణం తమ ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి ఉపయోగపడుతుందని మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి విశ్వనాధ్ తెలిపారు. దీంతోపాటు వేగంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. కస్టమర్ల ప్రతినిధులుగా సేవలు అందించేందుకు విభిన్న వర్గాలకు చెందిన వారిని నియమించుకునేలా, రిక్రూట్‌మెంట్ వ్యూహాలను వేగంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 23,000 మంది ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించారు.

దీంతోపాటు.. క్వాలిటీ ఏజెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే.. వెబ్ టు రిక్రూట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినగ్తు విశ్వనాథ్ తెలిపారు. దీంతోపాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ ‘మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్’ ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయని తెలిపారు. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయని.. పని కూడా వేగవంతమవుతుందని తెలిపారు.

ఇదిలాఉంటే.. గతేడాది నుంచి కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజల్లో ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్న అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలతో పాటు టర్మ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో బిజినెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా వేగవంతమవుతోంది.

Also Read:

Flipkart: ఏపీలో పదో తరగతి అర్హతతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ

ASRB Recruitment: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే.