ఇంటర్యూకి 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన టెకీ.. కంపెనీ ఊహించని ట్విస్ట్‌! నెట్టింట జోరు చర్చ..

ఓ ఇండియన్‌ టెకీ ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సదరు టెకీ r/IndianWorkplace సబ్‌రెడిట్‌లో తన అనుభవాలను వివరిస్తూ రెడిట్‌ పోస్టు పెట్టాడు. వర్క్‌ కల్చర్‌, ఇంటర్వ్యూ సెన్స్‌పై జనాల అభిప్రాయాలను ఇందులో వివరించాడు. జాబ్‌ ఇంటర్వ్యూ కోసం తాను మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన సందర్భంలో కలలో కూడా ఊహించని అనుభవం తనకు ఎదురైనట్లు తన పోస్టులో వెల్లడించాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంటర్యూకి 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన టెకీ.. కంపెనీ ఊహించని ట్విస్ట్‌! నెట్టింట జోరు చర్చ..
Ndian Techie Abruptly Ends Interview Over 3 Minute Delay

Updated on: Oct 07, 2025 | 11:58 AM

ఈ పోస్ట్‌లో.. ఐటీ ఆపరేషన్స్ టీమ్ లీడర్ (TL) అయిన భారతీయ నియామక నిర్వాహకుడు ఈ ఇంటర్వ్యూ చేశాడు. అయితే 3 నిమిషాలు ఆలస్యంగా 9:03 గంటలకు వచ్చినందుకు నేను క్షమాపణలు చెప్పాను. కొన్ని లాజిస్టికల్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని వివరించినట్లు తెలిపాడు. ఇప్పటికే మూడు నిమిషాలు ఆలస్యమైందని తనను తాను పరిచయం చేసుకోకుండానే చెప్పానన్నాడు. అయితే మేనేజర్‌ మాత్రం ‘నాకు అర్థమైంది. మిగిలిన ఇరవై ఏడు నిమిషాలు నేను మీకు తిరిగి ఇస్తాను. మీకు మంచి జరగాలి’ అని చెప్పి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్ళిపోయినట్లు తెలిపాడు. 3 నిమిషాల ఆలస్యానికే ఇంటర్వ్యూవర్ తనను తిరస్కరించడం ఊహించలేదని తన పోస్టులో వెల్లడించాడు.

ఇక ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు అభ్యర్థి ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు పరిస్థితిని మరింత పరిణతితో నిర్వహించి ఉండవల్సింది అంటూ రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇక్కడ పొరపాటు మీదే. ఇంటర్వ్యూ ఉదయం 9 గంటలకు ఉంటే మీరు 8:55 లేదా 8:57 లోపు వెళ్లాలి. ఇది సాధారణ విషయం’ అని ఒకరు. ఇది సరైన పని. ఈ వ్యక్తి మీ మేనేజర్ అయితే అతను మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాడు’ అని ఇంకొకరు కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. ఒకసారి రిక్రూటర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి 10 నిమిషాలు ఉందనగా అప్పుడే నిద్రలేచి బట్టలు మార్చుకుని కాల్‌ చేశాను. అతను 15 నిమిషాలు ఎందుకు ఆలస్యమయ్యానని అడిగాడు. దానికి నేను క్షమాపణలు చెప్పి, కాల్ ఉదయం 4:00 గంటలకు కాదని, సాయంత్రం 4:30 గంటలకు అని చెప్పాడు. ఆ తర్వాత తమ సంభాషణ కొనసాగిందని తెలిపాడు. చివరికి తాను సెలక్ట్‌ అయ్యానని చెప్పుకొచ్చాడు. సారాంశం ఏమిటంటే ఇదంతా అవతలి వైపు ఉన్న వ్యక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని మరో వ్యక్తి తన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకున్నాడు.

Culture at 09:03 is very important for an interviewer
byu/Efficient_Finance935 inIndianWorkplace

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన పని సంస్కృతిలో సమయపాలన, వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ రెండూ పోషించే కీలక పాత్రను స్పష్టంగా తెలుపుతుంది. ఇంటర్వ్యూయర్ కఠిన విధానం సమర్థనీయమని కొందరు నమ్మితే.. మరికొందరు అభ్యర్థి సమర్ధవంగా స్పందించాలని చెబుతారు. వాస్తవానికి ఇది ఏ పార్టీ తప్పు కాదు. కానీ రెండింటి కలయిక. సమయపాలన తప్పనిసరి అయినప్పటికీ సానుభూతి, కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యమైనవి. బహుశా అందుకే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వృత్తి నైపుణ్యం, వ్యక్తిగత ప్రవర్తనను సమతుల్యం చేసుకోవడం రెండూ సవాలుగా మారే పరిస్థితులను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటూనే ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.