RRB ALP Mock Test 2024: రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌

|

Nov 18, 2024 | 5:13 PM

రైల్వేలో ఉద్యోగం పొందాలనేది ఎందరికో కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏడాదంతా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. తాజాగా విడుదలైన అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు మరో 20 రోజులు రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ముందుగానే రైల్వే శాఖ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు అందుబాటులోకి తీసుకు వచ్చింది. వీటికి హాజరైతే ఆన్‌లైన్‌ పరీక్షలు సులువుగా ఉంటాయి..

RRB ALP Mock Test 2024: రైల్వేలో 18,799 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు.. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌
RRB ALP Mock Test
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 6: రైల్వే ఉద్యోగాలకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న అభ్యర్ధులకు రైల్వే శాఖ మాక్‌ టెస్ట్‌లు విడుదల చేసింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టెస్ట్‌లు రాయవచ్చు. ఈ మేరకు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను ఆర్‌ఆర్‌బీ రూపొందించింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే వివిధ పేపర్ల మాక్‌ టెస్టులు వినియోగించుకోవచ్చని సూచించింది. మాక్‌ టెస్టులు రాయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. కాగా దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు గత జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 వరకు పోస్టులున్నాయి. నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 కంప్యూటర్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 నియామక కంప్యూటర్‌ పరీక్షకు సంబంధించిన తేదీ విడుదలైంది. నవంబరు 10న పరీక్ష నిర్వహిస్తున్నట్లు మెడికల్, హెల్త్‌ సర్వీసెస్‌ నియామక బోర్డు బోర్డు ప్రకటించింది. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బోర్డు సూచించింది. పరీక్ష రోజున మధ్యాహ్నం 1.30కు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 2.45 గంటలకు గేటు మూసేస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 7416908215 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని తెల్పింది.

బీఎస్సీ నర్సింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నర్సింగ్‌ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్లు, రెండేళ్ల కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 7 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు 9,690 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటాకు సంబంధించి 8,084 సీట్లు అందుబాటులో ఉంచగా.. వాటిల్లో 6,664 సీట్లు తొలి విడతలో భర్తీ అయ్యాయి. ఇందులో మిగిలిన సీట్లతో పాటు ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.