Indian Navy Recruitment: ఇంటర్‌ పూర్తి చేసిన వారికి ఇండియన్‌ నేవీ సదవకాశం.. బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌..

|

Aug 13, 2022 | 5:14 PM

Indian Navy Recruitment 2022: ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ నేవీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బీటెక్‌ కోర్స్‌తో పాటు ఉద్యోగం పొందే సదవకాశాన్ని అందించింది. ఇందులో భాగంగా 10+2 (బీటెక్‌) క్యాడెట్..

Indian Navy Recruitment: ఇంటర్‌ పూర్తి చేసిన వారికి ఇండియన్‌ నేవీ సదవకాశం.. బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌..
Follow us on

Indian Navy Recruitment 2022: ఇంటర్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్‌ నేవీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బీటెక్‌ కోర్స్‌తో పాటు ఉద్యోగం పొందే సదవకాశాన్ని అందించింది. ఇందులో భాగంగా 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమీషన్) – జనవరి 2023 కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 పోస్టులను తీసుకోనున్నారు.

* వీటిలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ (31), ఎడ్యుకేషన్ బ్రాంచ్‌ (05) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 70% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో సీనియర్ సెకండరీ పరీక్ష (10+2) ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు జేఈఈ(మెయిన్)-2022 ర్యాంకు సాధించి ఉండాలి.

* అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* 02-01-2003 నుంచి 01-01-2006 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు.

* అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 18-08-2022న మొదలై 28-08-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..