IISC Recruitment: డిగ్రీతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

|

Dec 08, 2021 | 8:33 AM

Indian Institute of Science Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థ ప్రాజెక్ట్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనునున్నారు...

IISC Recruitment: డిగ్రీతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Iisc Recruitment
Follow us on

Indian Institute of Science Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థ ప్రాజెక్ట్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనునున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లోని జేఆర్‌డీ టాటా మెమోరియల్‌ లైబ్రరీలో ఈ పోస్టులు ఉన్నాయి. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ట్రెయినీ (12), ఎలక్ట్రానిక్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఈఆర్‌ఎమ్‌) ప్రాజెక్ట్ ట్రెయినీ (2) ఉన్నాయి.

* లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ లేదా లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు కనీసం సెకండ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులు కేవలం పాస్‌ అయితే చాలు.

* ఎలక్ట్రానిక్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజీనిరింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఫస్ట్‌లుక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 14-12-2021 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రెండేళ్ల కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు.

* ప్రాజెక్ట్‌ ట్రెయినీకి ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 జీతంగా చెల్లిస్తారు.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 14-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: అర్ధరాత్రి అనుకోని అతిధి !! ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే !! వీడియో

అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదు !! ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం !! వీడియో

దెయ్యానికి పెళ్లి !! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా ?? వీడియో