IIMR Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లూధియానాలోని ఈ సంస్థలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.
* మొత్తం 5 పోస్టులకు గాను ప్రాజెక్ట్ అసోసియేట్–01, టెక్నికల్ అసిస్టెంట్లు–04 ఉన్నాయి.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18–35ఏళ్ల మధ్య ఉండాలి.
* టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. బీఎస్సీ(అగ్రికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థుల వయసు 18–50 ఏళ్ల మధ్య ఉండాలి.
* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ. 31,000 చెల్లిస్తారు.
* టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.20,000లతో పాటు హెచ్ఆర్ఏ అందిస్తారు.
* అభ్యర్థులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీ రేపటితో (ఆదివారం)తో ముగియనుంది.
* 10-06-2021న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* సంబంధిత వివరాలను recruitment.iimr@gmail.com మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.
* పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: CBSE News Alert: 12వ తరగతి విద్యార్థుల కోసం కీలక అప్‌డేట్… పూర్తి వివరాలు తెలుసుకోండి
CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..