భారత వైమానిక దళంలో ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ -2/2023) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ (ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికేట్) బ్రాంచుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగివారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష (స్టేజ్-1, స్టేజ్-2), ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. వయోపరిమితి, జీతభత్యాలు, రాత పరీక్ష విధానం, సిలబస్ వంటి ఇతర వివారలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.