Air Force Recruitment: అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌.. అర్హులు ఎవరు? ఎలా ఎంపిక చేస్తారు.?

|

Mar 03, 2023 | 9:45 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగానే అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.?

Air Force Recruitment: అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌.. అర్హులు ఎవరు? ఎలా ఎంపిక చేస్తారు.?
Indian Air Force
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగానే అగ్నివీర్‌ వాయు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ అగ్నివీర్ వాయు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ఇంటర్మీడియట్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక దారుడ్య /వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్ధుల వయసు డిసెంబర్ 26, 2002 నుంచి జూన్ 26, 2006 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫేజ్ – 1, ఫేజ్ -3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 17న ప్రారంభమవుతుంది. పరీక్ష మే20వ తేదీన ప్రారంభమవుతుంది.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..