India Post Recruitment 2021: పదో తరగతి అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే..!

|

Nov 10, 2021 | 2:23 PM

India Post Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా రంగాలలో ఖాళీగా..

India Post Recruitment 2021: పదో తరగతి అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే..!
Follow us on

India Post Recruitment 2021: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నాయి. ఇక తాజాగా పోస్టల్‌ శాఖలో కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే.

స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆధ్వర్యంలోని ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. https://www.indiapost.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కింది పోస్టులకు అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ ఆపైన ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు:  పోస్టల్ అసిస్టెంట్ – 72,  పోస్ట్‌మ్యాన్ – 90, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ – 59

► పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టు: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

► మల్టీ టాస్కింగ్ స్టాఫ్: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

► పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 4 (రూ. 25,500-81,100)

► పోస్ట్‌మ్యాన్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 3 (రూ. 21,700-69,100)

► ఎంటీఎస్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 1 (రూ. 18,000-56,900)

అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు . వారు సంబంధిత పత్రాలతో పాటు పోస్ట్ ద్వారా దరఖాస్తులను AD (Recrt.), O/o CPMG, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిల్లీ – 110001కు సమర్పించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

UPSC CSE Answer Key 2020: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

CA Exams: పరీక్ష రాయాలంటే పేరెంట్స్‌ అనుమతి ఉండాల్సిందే.. సీఏ ఎగ్జామ్స్‌ మార్గదర్శకాలు విడుదల