India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారా..?.. ఫలితాలపై క్లారిటీ..!

|

Aug 02, 2021 | 9:27 AM

India Post GDS Results 2021: పోస్టల్‌ శాఖ ప్రతియేటా రెండుసార్లు అన్ని పోస్టల్ సర్కిళ్లల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. మొదటి దశలో భాగంగా తెలంగాణలో..

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారా..?.. ఫలితాలపై క్లారిటీ..!
Follow us on

India Post GDS Results 2021: పోస్టల్‌ శాఖ ప్రతియేటా రెండుసార్లు అన్ని పోస్టల్ సర్కిళ్లల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. మొదటి దశలో భాగంగా తెలంగాణలో 1150 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఫిబ్రవరిలో దరఖాస్తు గడువు ముగిసినా ఇంకా ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఫలితాలు ఎప్పుడు వస్తాయో అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటో ఇండియా పోస్ట్‌ను ట్విట్టర్ ద్వారా సంప్రదిస్తున్నారు అభ్యర్థులు. ట్విట్టర్‌లో సంప్రదించినవారందరికీ ఇండియా పోస్ట్ తరఫున రిప్లై కూడా వస్తోంది.

తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ సైకిల్ 3 రిక్రూట్‌మెంట్ ఫలితాలు తుది దశకు వచ్చాయని, వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగున్నట్లు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్ వివరణ ఇచ్చింది. ఏపీ సర్కిల్ ఫలితాల విషయంలోనూ ట్విట్టర్‌లో ఇదే వివరణ ఇచ్చింది ఇండియా పోస్ట్. ఫలితాల విడుదల ప్రక్రియ తుది దశలో ఉందని తెలిపింది.
అయితే ఇండియాపోస్టు ఎప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేసినా దరఖాస్తు ప్రక్రియ ముగిసిన రెండు నెలల్లో ఫలితాలు వచ్చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఆగస్ట్ వచ్చినా ఫలితాలు మాత్రం వెలువడలేదు. ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు గడువు ముగిసి ఐదు నెలలు దాటింది. అయినా ఫలితాలు మాత్రం విడుదల కాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ పోస్టుల్ని టెన్త్ అర్హతతో, పరీక్ష లేకుండా భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా ఫలితాలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఫలితాలు https://appost.in/ వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి. అభ్యర్థులు ఇదే వెబ్‌ట్ ఫాలో కావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బీహార్, మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

Insurance jobs: నిరుద్యోగులకు ‘మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్’ గుడ్‌న్యూస్.. 23 వేల ఏజెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

New Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. జూలై – సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారీగా కోలువులు