Post Office Jobs:దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోస్తూ.. భారతీయ పోస్టల్ రంగం గ్రామీణ్ డాక్ సేవక్-GDS పోస్టుల్ని భర్తీ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఈ ఈఏడాది ఫిబ్రవరిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 1150, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. ఈ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు విద్యార్దత 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత… అభ్యర్థుల నియామకం కోసం ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా అభ్యర్థుల మెరిట్ ద్వారా ఎంపిక చేయనుండడంతో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు.
ఏపీ తెలంగాణ నుంచి మొత్తం 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసినట్లు సమాచారం. అయితే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మూడు నెలల నుంచి రిజల్ట్ కోసం ఎదురు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ఇండియన్ పోస్ట్ ను సంప్రదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రామ్ అనే అభ్యర్థి అభ్యర్ధనపై స్పందించిన ఇండియన్ పోస్ట్ అభ్యర్థుల నియామకంపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఫలితాల విడుదల ఆలస్యానికి గల కారణాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాల అమలు ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉందని తెలిపింది.
Sir,
I am directed by the competent authority to inform you that an OA No. OA/021/00145/2021 & 147/2021 filed by Hon’ble CAT, Hyderabad and issued orders on 22.02.2021. The implementation of Hon’ble CAT order is under process.— India Post (@IndiaPostOffice) May 31, 2021
మరోవైఫు ఏపీ గ్రామీణ డాక్ సేవ్ పోస్టుల ఫలితాల కోసం అభ్యర్థులు 0866-2429821/822/824 నెంబర్లను లేదా rectt.ap@indiapost.gov.in ఇమెయిల్ ఐడీలో సంప్రదించాలని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
Sir, kindly contact on 0866-2429821/822/824 or email on rectt.ap@indiapost.gov.in for issues related to recruitment.
— India Post (@IndiaPostOffice) May 28, 2021
Also Read: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. మంచి నిద్ర కోసం ఈ సింపుల్ చిట్కాలు మీకోసం