Indbank Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. రాత పరీక్షలేకుండానే ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు!

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన చెన్నైలోని ఇండ్‌ బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Indbank Merchant Banking Services Limited).. వివిద పోస్టుల భర్తీకి అర్హులైన..

Indbank Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. రాత పరీక్షలేకుండానే ఇండ్‌బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు!
Indbank
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 9:49 PM

IndBank Chennai Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన చెన్నైలోని ఇండ్‌ బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Indbank Merchant Banking Services Limited).. వివిద పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 73

ఖాళీల వివరాలు: అకౌంట్‌ ఓపెనింగ్‌ స్టాఫ్‌, హెల్ప్‌ డెస్క్‌ స్టాఫ్‌, రీసెర్చ్‌ అనలిస్ట్‌, సిస్టమ్స్‌ అండ్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, బ్రాంచ్‌ హెడ్‌, ఫీల్డ్‌ స్టాఫ్‌ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఏడాదికి రూ.1,50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: హెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌, నెం 480, కివ్‌రాజ్ కాంప్లెక్స్‌ 1, అన్నా సలయ్, నందనం, చెన్నై.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Wonderful Music: క్యూట్‌.. క్యూట్‌గా.. పియానో ట్యూన్‌ ఆస్వాదిస్తున్న ఇంటి అతిథులు! స్వర్గం ఇలానే ఉంటుందా..