IITM Pune Recruitment 2022: రాత పరీక్షలేకుండానే ఎంపిక.. ఐఐటీఎమ్‌- పూణెలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు 2లక్షలకు పైగా జీతం..

|

Jul 23, 2022 | 5:09 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM Pune).. ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

IITM Pune Recruitment 2022: రాత పరీక్షలేకుండానే ఎంపిక.. ఐఐటీఎమ్‌- పూణెలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు 2లక్షలకు పైగా జీతం..
Iitm
Follow us on

IITM Pune Scientist Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM Pune).. ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల (Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు సదావకాశం. కింది స్పెషలైజేషన్‌లో డిగ్రీ పాస్ అయ్యి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండనే ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 20

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సైంటిస్ట్ బి, సి, డి పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/జియోఫిజిక్స్/ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్ సైన్సెస్/మెటియోరాలజీలో మాస్టర్స్ డిగ్రీ, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్ అవసరం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

అడ్రస్: Indian Institute of Tropical Meteorology (IITM), Dr. Homi Bhabha Road, Pashan, Pune-411008.

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 16, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్‌ 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.