Jobs in IIT Roorkee: బీకాం/ఎంకాం అర్హతతో ఐఐటీ రూర్కీలో  ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

|

Feb 02, 2022 | 8:48 AM

భారత ప్రభుత్వానికి చెందిన రూర్కీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Roorkee) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Jobs in IIT Roorkee: బీకాం/ఎంకాం అర్హతతో ఐఐటీ రూర్కీలో  ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Iit Roorkee
Follow us on

IIT Roorkee Project Assistant Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన రూర్కీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Roorkee) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిన్‌, అకౌంట్స్‌ విభాగాల్లోని ఖాళీలను పూరించనున్నారు. టిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 5

పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో బీకాం/ఎంకాం, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.15,000 నుంచి రూ.45,000లు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: arsric@iitr.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Teaching Jobs: పీహెచ్‌డీ అర్హతతో.. ఐఐఐటీ వడోదరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ. లక్షకు పైగా జీతం!