IIT Hyderabad Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), హైదరాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ శివారుల్లో సంగారెడ్డికి సమీపంలో ఉన్న ఈ క్యాంపస్‌లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ విభాగాల్లో ఖాళీగా ఉన్న డాక్టోరల్ రిసెర్చ్ ఫెలోషిప్ (డీఆర్‌ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ / ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 55,000 వరకు చెల్లిస్తారు.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 24-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..!