GATE 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మీకు మరో ఛాన్స్!

GATE 2026 Online Application Last Date Extended to October 6: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబర్ 28న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఐఐటీ గువహటి ప్రకటన వెలువరించింది..

GATE 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మీకు మరో ఛాన్స్!
GATE 2026 Online Application Last Date

Updated on: Sep 29, 2025 | 4:59 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి.. నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబర్ 28న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఐఐటీ గువహటి ప్రకటన వెలువరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విండోను ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు అక్టోబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 9, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ గువహటి తన ప్రకటనలో పేర్కొంది.

గేట్‌-2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ బడుల్లో అకడమిక్‌ వాల్‌ క్యాలెండర్‌

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు డీఈఓ, కలెక్టరేట్‌లలో ఇకపై విద్యా క్యాలెండర్‌ను ప్రదర్శించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ వాల్‌ క్యాలెండర్లను ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ముద్రణ అనంతరం వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

విద్యా క్యాలెండర్‌పై పదుల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంటున్నా అందులో అధిక శాతం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ వివరాలు టీచర్లకు తప్ప విద్యార్థులకు తెలియడం లేదు. అందుకే ఏ నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, సెలవులు, పరీక్షల వివరాలతో క్యాలెండర్‌ను రూపొంది.. అందరికీ కనిపించేలా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.