IIITT Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు..

|

Nov 02, 2022 | 6:18 PM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. 24 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IIITT Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీచింగ్‌ ఉద్యోగాలు..
IIIT Tiruchirappalli Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. 24 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించి ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 2, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.70,900ల నుంచి రూ.1,59,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్:

The Registrar (i/c)
Indian Institute of Information Technology Tiruchirappalli
Sethurapatti, Trichy- Madurai Highway,
Tiruchirappalli, Tamil Nadu-620012

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.