IICB Recruitment 2022: నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హతతో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో ఖాళీలు..

|

Apr 20, 2022 | 8:22 AM

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (IICB).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Vacancy) ఖాళీల భర్తీకి..

IICB Recruitment 2022: నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హతతో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో ఖాళీలు..
Iicb
Follow us on

IICB JRF Recruitment 2022: కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (IICB).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF Vacancy) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

విభాగాలు: కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కెమికల్‌ బయాలజీ, న్యూరో బయాలజీ, క్యాన్సర్ బయాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్‌, స్ట్రక్చరల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, సెల్‌ బయాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: కెమిస్ట్రీ/బయాలజీ స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీఎస్ఐఆర్‌/యూజీసీ-నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి. ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా అర్హులే.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: జేసీరే ఆడిటోరియం, జాదవ్‌పూర్‌ క్యాంపస్‌, ఐఐసీబీ, కోల్‌కతా.

ఇంటర్వ్యూ తేదీ: మే 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSEET 2022 July రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..