IGNOU launches MA English in online mode: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) ఆన్‌లైన్ మోడ్ (MEGOL)లో ఎంఏ ఇంగ్లీష్ (Master of Arts, English online course)ను జనవరి 31, 2022న ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignouiop.samarth.edu.inలో దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించింది. ఎంఏ ఇంగ్లీష్ ఆన్‌లైన్ కార్యక్రమం రెండు సంవత్సరాలపాటు ఉంటుంది. దీనిలో భాగంగా విద్యార్ధులకు ఇంగ్లీష్, అమెరికన్ లిటరేచర్‌తోపాటు, కెనడియన్, ఆస్ట్రేలియన్, ఇండియన్ ఇంగ్లీష్ వంటి కొత్త సాహిత్యాలపై కూడా అవగాహన కల్పిస్తుంది.
ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగి అభ్యర్ధులెవరైనా ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. MA English ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేవారు మొదటి ఏడాది రెండు కోర్సులను తప్పనిసరిగా చదవల్సి ఉంటుంది. మిగతా సబ్జెక్టులను అభ్యర్ధి అభిరుచి మేరకు ఎంపిక చేసుకోవచ్చు. ఏదైన కారణంవల్ల అభ్యర్ధి ఎంఏ ఇంగ్లీష్ కోర్సును పూర్తి చేయలేకపోతే 32 క్రెడిట్ పాయింట్లతో కోర్సు పూర్తైన తర్వాత పీజీ డిప్లొమా ఇంగ్లీష్ సర్టిఫికేట్‌ను అందిస్తారు. మొత్తం కోర్సుకు ఏడాదికి రూ.6,800ల చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.13,600లు ఫీజు చెల్లించాలి. మొదటి ఏడాది రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200లుఉంటుంది.
ఆన్‌లైన్‌లో ప్రారంభమైన ఈ కోర్సు ద్వారా ఎక్కువ మంది అభ్యర్ధులు ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది.
Also Read: