IDBI Bank Recruitment 2021: డిగ్రీతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. నెలకు రూ.36,000 ప్రారంభ జీతం.. ఇలా దరఖాస్తు చేయండి..

|

Aug 23, 2021 | 6:26 AM

నిర్యుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

IDBI Bank Recruitment 2021: డిగ్రీతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. నెలకు రూ.36,000 ప్రారంభ జీతం.. ఇలా దరఖాస్తు చేయండి..
Idbi Vacancy 2021
Follow us on

నిర్యుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మణిపాల్‌ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది (9 నెలలు క్లాస్‌ రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్) వ్యవధి గల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్)లో శిక్షణ ఇస్తుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం లభిస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 650

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 22, 2021

కనీసం విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా (డిగ్రీ) గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు… ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఇలా..: దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు కట్‌ చేస్తారు. పరీక్షలో లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60 ప్రశ్నలు; ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40; క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం 9 నెలలు ఉంటుంది. నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ (3 నెలలు) సమయంలో నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల నుంచి రూ.36,000 నుంచి రూ.49,910 వరకు అందుతుంది.

పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 04, 2021

ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …

CA Exams 2021: ఫైనల్, ఇంటర్ పాత కోర్సు పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్.. చివరి ప్రయత్నంగా మరో అవకాశం..