ICSIL Jobs: ఇంటర్‌ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 583 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్‌).. 583 మీటర్‌ రీడర్స్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

ICSIL Jobs: ఇంటర్‌ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 583 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
ICSIL New Delhi

Updated on: Mar 08, 2023 | 1:38 PM

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్‌).. 583 మీటర్‌ రీడర్స్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మీటర్‌ రీడర్స్‌ పోస్టులకైతే 12వ తరగతి, ఫీల్డ్‌ సూపర్‌వైజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నింపే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.1000లు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,357ల నుంచి రూ.22,146ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.