ICSI CS December 2021 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డులు ఎప్పుడంటే..

|

Feb 25, 2022 | 5:57 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI).. సీఎస్‌ డిసెంబర్‌ 2021 ఫలితాలు నేడు (ఫిబ్రవరి 25) విడుదలయ్యాయి...

ICSI CS December 2021 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డులు ఎప్పుడంటే..
Icsi Cs Results
Follow us on

How to check CS December 2021 results: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI).. సీఎస్‌ డిసెంబర్‌ 2021 ఫలితాలు నేడు (ఫిబ్రవరి 25) విడుదలయ్యాయి. ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఐసీఎస్‌ఐ అధికారిక వెబ్‌సైట్ icsi.eduలో చెక్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో కొత్త సిలబస్‌ (professional) ప్రకారం.. ఆన్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌గా శృతి నగర్ టాప్‌లో నిలవగా, హరి హరన్ ద్వితీయ స్థానంలో, జ్యోతి అశోక్ కుమార్ సాహ్ తృతీయ స్థానంలో నిలిచారు. పాత సిలబస్‌ ప్రకారం ఈ పరీక్షలో ఆదిత్య సోనీ అగ్రస్థానంలో నిలవగా, శివానందన్ డీఏ రెండో ర్యాంకు, ఉర్విష్‌ కుమార్ మన్‌సుఖ్లాల్ కరాథియా మూడో ర్యాంకు సాధించారు. సిఎస్ ఎగ్జిక్యూటివ్ కోర్సు (New Syllabus)లో చిరాగ్ అగర్వాల్ టాప్‌ ర్యాంక్ సాధించగా, ఎస్ స్వాతి, శుభం సునీల్ చోర్డియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పాత సిలబస్ ప్రకారం ఈ పరీక్షల్లో ఆదిత్య జైన్ ప్రథమ స్థానంలో నిలవగా, సుర్భి శ్యాంసుందర్ సోనీ ద్వితీయ స్థానంలో, దివ్య షెకావత్ మూడో స్థానంలో నిలిచారు. సీఎస్‌ ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ పరీక్షల ఫలితాలు, మార్కుల షీట్లు అభ్యర్థుల రిజిస్టర్డ్ చిరునామాలకు పోస్టు ద్వారా పంపబడతాయి.

ICSI CS result 2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌icsi.eduను ఓపెన్ చెయ్యాలి.
  • ‘view Result and Download E-Mark Sheet’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • ఫలితాలు కోరదలచిన పరీక్షను ఎంచుకోవాలి.
  • అభ్యర్థుల వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై ఫలితాలకు సంబంధించిన పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • సేవ్‌ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Also Read:

GATE 2022 results: గేట్‌ 2022 అభ్యంతరాలకు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లోనే..