Job Mela: మీరు డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.? రకరకాల కోర్సులు చేసి ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు మంచి అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 25 శనివారం రోజున భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళా కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ జాబ్ మేళా సెప్టెంబర్ 25 (శనివారం)న ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక జాబ్ మేళాను అమీర్ మెయిన్ రోడ్‌లో ఉన్న కమ్మ సంఘంలో (చందన బ్రదర్స్ వెనకాల) నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు bit.ly/jcepass వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీ విద్యార్హతలతో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇక భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. అలాగే ఏకంగా 2500కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
#MegaJobMela on 25th September, 2021 @ Kamma Sangam Ameerpet… #JobMela #WestZonePolice #HyderabadCityPolice pic.twitter.com/P1bdMCLqAV
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 22, 2021
Mars Quakes: అంగారకుడిపై కూడా ప్రకంపనలు.. ఒక నెలలోనే మూడు సార్లు వణికిన అరుణ గ్రహం
Gangrape: అమానుషం.. అంతకుమించిన ఘోరం.. మహారాష్ట్రలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై 29 మంది గ్యాంగ్‌రేప్..