Inspiration Story: ఒకేసారి 3 సర్కార్ కొలువులు కొట్టిన హైదరాబాద్‌ అమ్మాయి.. ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్

TGPSC Group 2 toppers journey: సరైన ప్రణాళిక లేకుండా రోజుకు ఎన్ని గంటలు చదివినా వృథాప్రయాసే అవుతుందని అంటుంది హైదరాబాద్‌కు చెందిన జ్యోత్స్న. ఆమె తండ్రి ఉమేష్‌ ప్రైవేటు ఉద్యోగి. తల్లి స్వరణి గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ..

Inspiration Story: ఒకేసారి 3 సర్కార్ కొలువులు కొట్టిన హైదరాబాద్‌ అమ్మాయి.. ఉద్యోగం చేస్తూనే  ప్రిపరేషన్
TGPSC Group 2 topper Jyothna

Updated on: Oct 21, 2025 | 10:40 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 21: ఓ మధ్యతరగతి అమ్మాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్‌ పరీక్షల్లో వరుసగా 3 ఉద్యోగాలకు ఎంపికైంది. సరైన ప్రణాళిక లేకుండా రోజుకు ఎన్ని గంటలు చదివినా వృథాప్రయాసే అవుతుందని అంటుంది హైదరాబాద్‌కు చెందిన జ్యోత్స్న. ఆమె తండ్రి ఉమేష్‌ ప్రైవేటు ఉద్యోగి. తల్లి స్వరణి గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ తండ్రి ఉమేష్‌ ముగ్గురు సంతానాన్ని ఎలాంటి లోటూ రానివ్వ కుండా చదివించారు. వీరి పెద్దమ్మాయి జ్యోత్స్న ప్రభుత్వోద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదిలో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌లో స్టేట్‌ ర్యాంక్, డిగ్రీ బీఏ ఎకనామిక్స్‌లో బంగారు పతకం సాధించింది.

ఆపై ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 5 నెలల పాటు కోచింగ్‌ తీసుకుంది. అక్కడ నేర్చుకున్న ప్రాథమిక అంశాలతో ఆ తర్వాత ఇంట్లోనే ప్రిపేర్‌ సాగించింది. ఈలోగా కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి.. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్స్‌కి ప్రిపరేషన్‌ సాగించింది. అంతే.. గ్రూప్‌ 2, 3, 4 ఉద్యోగాలు ఒకదాని వెంట ఒకటిగా క్యూ కట్టాయి. వీటిలో గ్రూప్‌ 2 విభాగంలో అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ కొలువుకి శనివారం సీఎం రేవంత్‌ చేతుల మీదగా నియామక పత్రాన్ని అందుకుంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేరేషన్‌ సాగించి వరుస కొలువులు దక్కించుకున్న జ్యోత్స్న ప్రయాణం నేటి యువతకు ఎంతో ఆదర్శం. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎంతో అవసరం అంటుంది జ్యోత్స్న.

బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు గడువు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.