TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌, బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

TG Govt Jobs 2026: రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
Hyderabad NIRDPR Recruitment

Updated on: Jan 21, 2026 | 3:04 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌, బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 98 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 10, కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 88 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

సీనియర్ కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు ఏదైనా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. కెపాసిటీ బిల్డింగ్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు కూడా ఏదైనా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్‌ 31, 2025వ తేదీ నాటికి 50 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.300 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.75,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.