HQ Northern Group C CSBO Recruitment 2022: భారత ప్రభుత్వ డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన ఇండియన్ ఆర్మీ.. నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం (Army HQ Northern Command).. ఫైర్‌మెన్, సివిలియన్ మోటర్ డ్రైవర్, వెహికల్ మెకానిక్, క్లీనర్, మజ్దూర్ పోస్టు (Fireman posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు:
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి రూ.45700ల వరకు జీతంగా చెల్లిస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పిజికల్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు గానూ 2 గంటల్లో…150 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రశ్నల సరళి:
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Commanding Officer 5171 ASC Bn (MT) PIN:905171 C/O 56 APO
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (ఆగస్టు 22, 2022).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.