HQ Central Command Jobs 2022: సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో గ్రూప్-సీ ఉద్యోగాలు..విద్యార్హత పదో తరగతి ఉంటే చాలు..

|

Aug 06, 2022 | 7:10 PM

ఇండియన్ ఆర్మీకి చెందిన HQ Central Command లో 96 గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈఉద్యోగాలకు ధరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 6వ తేదీ నుంచి ప్రారంభమై

HQ Central Command Jobs 2022: సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో గ్రూప్-సీ ఉద్యోగాలు..విద్యార్హత పదో తరగతి ఉంటే చాలు..
Indian Army
Follow us on

Jobs: ఇండియన్ ఆర్మీకి చెందిన HQ Central Command లో 96 గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈఉద్యోగాలకు ధరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 6వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 16 వ తేదన ముగుస్తుంది. బార్బర్, చౌకీదార్, సఫైవాలీ, ట్రేడ్స్ మ్యాన్ మేట్ మొదలగు విభాగాల్లో నియమకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్ ను  ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ నుండి  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  పూర్తిచేసిన దరఖాస్తు ఫారమ్ ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా క్రింది పేర్కొన్న చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించే ఈఉద్యోగాలకు కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి సంబంధించి వృత్తి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది.

అర్హతలు: 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవాలి. కేంద్రప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ప్రకటనలో పేర్కొన్న విధంగా వయస్సు సడలింపు ఉంటుంది. రాత పరీక్షతో పాటు ట్రేడ్ ఎగ్జామ్ ద్వారా ఈఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ధరఖాస్తు చేసే అభ్యర్థులు ధరఖాస్తు ఫారంతో పాటు పూర్తి చిరునామాతో కూడిన ఎన్వలప్ కవర్ ను జతచేయాల్సి ఉంటుంది.

పరీక్ష రుసుము: జనరల్, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EWS) అభ్యర్థులు Commandant MH Roorkee పేరుతో చెల్లుబాటు అయ్యే విధంగా వందరూపాయల పోస్టల్ ఆర్డర్ ను తీసి ధరఖాస్తు ఫారమ్ తో పంపించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటీవల తీయించుకున్న రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలను ధరఖాస్తుతో జతచేయాలి.

ఇవి కూడా చదవండి

పూర్తిచేసిన ధరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: HQ Central Command (BOO-II), Military Hospital Roorkee, Haridwar District (Uttarakhand), PIN – 247667

మరిన్ని విద్య ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..