HSCL Recruitment 2021: భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన హిందూస్థాన్ స్టీల్ వర్క్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్‌కతాలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* 20 ఖాళీలకు గాను.. జనరల్ మేనేజర్ (సివిల్) – (06), అడిషనల్ జనర్ మేనేజర్ (సివిల్) – (05), డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) -(04), జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) – (01), అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) – (01), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) – (01), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లా) – (01), అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్ఎం) – (01) పోస్టులను తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులను అనుసరించి.. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ (ఎల్ఎల్‌బీ), ఇంజినీరింగ్ డిగ్రీ, సీఎంఏ/ సీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 14-06-2021 నుంచి ప్రారంభంకాగా.. 14-07-2021న పూర్తికానుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Tenth and Inter : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల అయోమయానికి త్వరలోనే శుభం కార్డు.!
Ambati : టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటి ప్రశ్న