Hindustan Salts Limited: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..

|

Aug 02, 2021 | 2:28 PM

Hindustan Salts Limited Recruitment: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజస్థాన్‌లోని జయపురలో ఉన్న ఈ సంస్థలో పలు ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిషికేషన్‌లో భాగంగా...

Hindustan Salts Limited: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
Hsl Recruitment
Follow us on

Hindustan Salts Limited Recruitment: హిందుస్థాన్‌ సాల్ట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజస్థాన్‌లోని జయపురలో ఉన్న ఈ సంస్థలో పలు ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిషికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (02-08-2021) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 10 ఖాళీలకు గాను అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నాలజీ) – 01, జూనియర్‌ మేనేజర్‌ (టెక్నాలజీ)–01, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌(ప్రొడక్షన్‌)–08 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్‌ మేనేజర్‌(టెక్నాలజీ) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.
* జూనియర్‌ మేనేజర్‌(టెక్నాలజీ) ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ సబ్జెక్టులో డిప్లొమా/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ (ప్రొడక్షన్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు తమ పూర్తి వివరాలను hr.sambhar@indiasalt.com ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.
* ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు గడువు నేటితో (02-08-2021) ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారా..?.. ఫలితాలపై క్లారిటీ..!

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

Insurance jobs: నిరుద్యోగులకు ‘మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్’ గుడ్‌న్యూస్.. 23 వేల ఏజెంట్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్