అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు గురుకుల అధికారివ వెబ్‌సైట్ నుంని హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కార్యదర్శి నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. కాగా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలక ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏపీఆర్‌జేసీ, డీసీ ప్రవేశ పరీక్షలు అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టీల్ సెక్టార్ 3 (ఉక్కు నగరం)లోని కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ ప్రకటన వెలువరించారు. నేటి (ఏప్రిల్ 18) నుంచి కేంద్రీయ విద్యాలయలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. దరఖాస్తులు పూర్తి చేసి పాఠశాలలో అందజేయాలని, ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నంలోపు దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఇక మే 1వ తేదీన లాటరీ ద్వారా సీటు పొందిన విద్యార్ధుల జాబితా వెల్లడిస్తామని అయన అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.