HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ బెంగళూరులో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
HAL Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ బెంగళూరులో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సెక్యూరిటీ ఆఫీసర్లు (06), ఆఫీసర్ (ఆఫీషియల్ లాంగ్వేజ్) 04 ఖాళీలు ఉన్నాయి.
* సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రీ కమిషన్ ట్రెయినింగ్ కోర్సు విజయంతంగా పూర్తి చేసుకొని ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ సెక్షన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్, 15/1 కబ్బన్ రోడ్, బెంగళూరు 56001 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-05-2022ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..