BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగవకాశాలు.. అర్హత పదోతరగతి.. జీతం ఎంతో తెలుసా..?

|

Feb 22, 2022 | 1:23 PM

BSF Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. బీఎస్‌ఎఫ్ నుంచి ట్రేడ్‌ మెన్‌ నోటిఫికేషన్ విడుదలైంది.

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగవకాశాలు.. అర్హత పదోతరగతి.. జీతం ఎంతో తెలుసా..?
Bsf Constable Recruitment 2
Follow us on

BSF Recruitment 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. బీఎస్‌ఎఫ్ నుంచి ట్రేడ్‌ మెన్‌ నోటిఫికేషన్ విడుదలైంది. రక్షణ దళాలలో పనిచేయాలని కోరిక ఉండేవారికి ఇది సువర్ణవకాశం. ఈ పోస్టులకి అప్లై చేయాలనుకునేవారు పదో తరగతి, ఐటీఐ చదివి ఉండాలి. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్‌ టెస్టులు, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత

పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్‌ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. వయసు 01.08.2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మధ్య ఉండాలి. స్త్రీలు157 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైట్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీఈటీ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. పైన టెస్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించే ఈ పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ మీద రాయాలి. అంటే ఆఫ్‌లైన్‌ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

వేతనాలు

పే మ్యాట్రిక్స్‌ లెవల్‌ 3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ69,100 వరకు చెల్లిస్తారు. ఇవేకాకుండా ఇతర అలవెన్సులు కూడా పొందుతారు.

Thati kallu: తాటికల్లు ఆ సమయంలో తాగితే అద్భుతం.. దాని ప్రయోజనాలు పుష్కలం..!

Dangers Brushing: ఎక్కువ సేపు బ్రష్ చేస్తున్నారా.. పళ్లతో పాటు వీటికి కూడా ఎఫెక్టే..?

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?