AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..

| Edited By: Ravi Kiran

Aug 19, 2021 | 9:28 AM

AP IIIT Notification Release: ఏపీలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. పదోతరగతి పూర్తయిన విద్యార్థులు ఇందులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
Ap Iiit
Follow us on

AP IIIT Notification Release: ఏపీలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. పదోతరగతి పూర్తయిన విద్యార్థులు ఇందులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఫలితాలు రిలీజ్‌ చేసి అడ్మిషన్లు కేటాయిస్తారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. సాధారణంగా ప్రతీ ఏటా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రవేశ పరీక్ష నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

పదో తరగతి పూర్తికాగానే చాలామంది ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులే లక్ష్యంగా ఇంటర్మీడియెట్‌లో చేరుతుంటారు. ఇంటర్‌ స్థాయి నుంచే కార్పొరేట్‌ కాలేజీల్లో లక్షల్లో ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్న వారికే నాణ్యమైన చదువులు అందే పరిస్థితి. దాంతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రొఫెషనల్‌ కోర్సులు కలగానే మిగిలిపోయేవి. ఇలాంటి పరిస్థితిని గమనించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. పల్లె ప్రతిభకు పట్టం కట్టాలని.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభా వంతులైన పేద విద్యార్థులకు పదో తరగతి నుంచే ప్రొఫెషనల్‌ నైపుణ్యాలు అందించాలనే సదాశయంతో ఏపీ ట్రిపుల్‌ ఐటీలకు రూపకల్పన చేశారు.

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్.. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..

High Court judges: హైకోర్టు జడ్జిలుగా ఏడుగురి పేర్లు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hyderabad: పోలీసులకు పాలాభిషేకం.. సత్వర న్యాయం చేసినందుకు రుణం తీర్చుకున్న బాధితుడు

Schemes for Farmers: రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఐదు ముఖ్య పథకాలు.. పూర్తి వివరాలు మీకోసం..