GMC Rajanna Sircilla Jobs 2025: సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

GMC Rajanna Sircilla Recruitment 2025 Notification: జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

GMC Rajanna Sircilla Jobs 2025: సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
GMC Rajanna Sircilla Jobs

Updated on: Nov 19, 2025 | 6:22 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో భర్తీ కానున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబరు 22వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇలా..

  • ప్రొఫెసర్‌ పోస్టుల సంఖ్య: 10
  • అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 19
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 14
  • సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల సంఖ్య: 34

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం కూడా ఉండాలి. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో పేరు నమోదు చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 2025, అక్టోబర్‌ 1వ తేదీ నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 22, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్యూలను ఈ కింది అడ్రస్‌లో నిర్వహిస్తారు.

అడ్రస్..

ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.