తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30 లక్షల జీతం

ఏపీ యువతకు జర్మనీలో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ‘జర్మనీ జాబ్‌ ఆపర్చునిటీ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. బీఎస్సీ నర్సింగ్‌, ఏఎన్‌ఎం అర్హత ఉన్న 18–35 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.2.75 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు వేతనం పొందొచ్చు. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30 లక్షల జీతం
Germany Job Opportunities For Ap Nursing Candidate

Updated on: Aug 19, 2026 | 10:39 AM

అమరావతి, ఆగస్ట్‌ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు తెలిపారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు (SC), షెడ్యూల్డ్‌ తెగలు (ST) వర్గాలకు చెందిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ‘జర్మనీ జాబ్‌ ఆపర్చునిటీ ప్రోగ్రామ్‌’ ద్వారా విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో అభ్యర్థుల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జర్మన్‌ భాషలో బి-2 స్థాయి వరకు శిక్షణ అందించడంతో పాటు జర్మనీలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

జర్మనీలో ఉద్యోగాల కోసం ఏపీ యువత ఆన్ లైన్ దరఖాస్తు ఇక్కడ చేసుకోండి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. కనీసం బీఎస్సీ నర్సింగ్‌ లేదా ఏఎన్‌ఎం (ANM) అర్హత కలిగి ఉండాలి. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు భాషా శిక్షణ, వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ అందిస్తారు. జర్మన్‌ భాషలో బి-2 స్థాయికి చేరుకునేలా మొత్తం శిక్షణను అందించనున్నారు. శిక్షణ వ్యవధి సుమారు 8 నుంచి 10 నెలలు ఉండనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత జర్మనీలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నెలకు రూ.3.30 లక్షల వరకు వేతనం

జర్మనీలో ఉద్యోగం లభించిన తర్వాత అభ్యర్థులు నెలకు సుమారు రూ.2.75 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు తెలిపారు. దీంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఏపీకి చెందిన నర్సింగ్‌ అభ్యర్థులకు ఈ కార్యక్రమం మంచి అవకాశంగా మారనుంది. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని పరిశీలించి, అధికారిక వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం AP Naipunyam అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

జర్మనీలో ఉద్యోగాల కోసం ఏపీ యువత ఆన్ లైన్ దరఖాస్తు ఇక్కడ చేసుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us