GATE 2021 Result Declared: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ, ముంబయి.. 2021 గేట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నిజానికి ఈ పరీక్ష ఫలితాలు మార్చి 22న విడుదల చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన తేదీ కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఐఐటీ ముంబయి అధికారిక వెబ్‌సైట్ gate.iitb.ac.inను సందర్శించాలని అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 14న నిర్వహించిన ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలో 78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక 2021 గేట్ పరీక్షను ఫిబ్రవరి 6,7,13,14 తేదీల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో 1,26,813 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 98,732 మంది పురుషులు, 28,081 మంది మహిళలు ఉన్నారు. ఇక పరీక్ష పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి 26న సమాధాన పత్రాన్ని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసం మార్చి 4 వరకు గడువు ఇచ్చిన బోర్డు అనంతరం ఫైనల్ కీ పేపర్‌ను విడుదల చేసింది.
* అభ్యర్థులు ముందుగా అధికారకి వెబ్‌సైట్ gate.iitb.ac.inలోకి వెళ్లాలి.
* అనంతరం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పరీక్ష ఫలితాల లింక్‌ప్లై క్లిక్ చేయాలి.
* తర్వాత అప్లికేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు అందించాలి.
* వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు విడుదల అవుతాయి.
* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫలితాల పేజీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.