GAIL Recruitment 2023: BE/B Tech అర్హతతో గెయిల్‌ ఇండియాలో 277 ఇంజనీర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000ల జీతం..

|

Jan 04, 2023 | 5:09 PM

భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. 277 చీఫ్‌ మేనేజర్‌, సీనియర్ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

GAIL Recruitment 2023: BE/B Tech అర్హతతో గెయిల్‌ ఇండియాలో 277 ఇంజనీర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000ల జీతం..
GAIL Limited Recruitment 2023
Follow us on

GAIL Jobs 2023: భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. 277 చీఫ్‌ మేనేజర్‌, సీనియర్ ఇంజినీర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, సెక్యూరిటీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్‌, రెన్యూవెబుల్‌ ఎనర్జీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌/బీఈ/ బీటెక్‌/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 2, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందనివారు ఫీజు చెల్లించనవసరం లేదు. షార్ట్‌లిస్టింగ్‌, స్క్రీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.