AP 10th Result Date 2026: వచ్చే నెల 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

రాష్ట్ర పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి మొదలకానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 4 నుంచి 13 వరకు మొత్తం 10 రోజుల్ల మూల్యాంకనం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలపై డైరెక్టర్..

AP 10th Result Date 2026: వచ్చే నెల 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?
SSC 10th Class Spot Valuation Dates

Updated on: Mar 29, 2026 | 10:21 AM

అమరావతి, మార్చి 29: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి మొదలకానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 4 నుంచి 13 వరకు మొత్తం 10 రోజుల్ల మూల్యాంకనం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. మూల్యాంకనంలో పాటించాల్సిన నిబంధనలపై డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లా కేంద్రాల్లో 10 రోజుల పాటు ఈ మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు ఒక రోజుకు 40 జవాబు పత్రాలను అందిస్తారు. ఇందులో ఉదయం 20, మధ్యాహ్నం నుంచి 20 చొప్పున జవాబు పత్రాలను మూల్యాంకనానికి అందిస్తారు. అసిస్టెంట్ ఎగ్జామినర్‌ మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విధానం ఇంటర్‌తోపాటు పదో తరగతికి కూడా వర్తిస్తుందని అన్నారు. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబుల్లో నమోదు చేసి పొరబాట్లకు తావులేకుండా ఖచ్చితత్వం పాటించాలని హెచ్చరించింది. గతేడాదీ మూల్యాంకన సమయంలో మార్కుల లెక్కింపులో తప్పిదాలు జరిగినందున ఈసారి ఆ పొరబాట్లు లేకుండా ట్యాబ్‌లను వినియోగించాలని సూచించారు. ఇక ఏప్రిల్ 14 నుంచి మార్కుల నమోదు ప్రక్రియను మరో 10 రోజుల్లో పూర్తి చేసి ఏప్రిల్‌ మూడో వారం నాటికి పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తుంది. గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 ఇంగ్లిష్ ఫరీక్షతో ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us