Ethical Hacking Courses: హ్యాకర్స్.. ఈ పదం వింటేనే అదోరకమైన భయం కలుగుతుంది. అవును, హ్యాకర్ల కారణంగా ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. హ్యాకర్లు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల డబ్బులను కాజేస్తుంటారు. అయితే, అందరు హ్యాకర్స్ అలా ఉండరు. వీనిలో మంచి హ్యాకర్స్(ఎథికల్ హ్యాకర్స్) ఉంటారు.. చెడు హ్యాకర్సు ఉంటారు. ఎథికల్ హ్యాకర్స్ సమాజానికి ఉపయోగపడేవారు ఉంటారు. మీరు కూడా ఎథికల్ హ్యార్స్‌గా మారాలనుకుంటున్నారా? ఇందుకోసం ప్రత్యేకంగా కోర్సులున్నాయని మీకు తెలుసా? అవును, మార్కెట్‌లో ఈ ఎథికల్ హ్యాకర్స్‌కి ఫుడ్ డిమాండ్ కూడా ఉంది.
వాస్తవానికి ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ గానీ చేసి ఉండాలి. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఎలాంటి హానికరమైన ఉద్దేశం లేకుండా హ్యాకింగ్ చేయడం. ఎథికల్ హ్యాకర్లు సమాచారాన్ని సేకరించడం ద్వారా ఎవరికీ హాని కలిగించరు. ప్రతిగా హానీకరమైన హ్యాకింగ్స్ గురించి కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ రంగానికి సహాయం చేస్తారు. అందుకే ఈ ఉద్యోగానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
హ్యాకర్లను మూడు వేర్వేరు వర్గాలుగా విభజించారు. ఇందులో 1- బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు. 2- వైట్ హ్యాట్ హ్యాకర్లు. 3- గ్రే హ్యాట్ హ్యాకర్లు. మీరు బ్లాక్ హ్యాట్ హ్యాకర్లను నేరస్తులుగా భావించొచ్చు. దురుద్దేశంతో హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్లు నైతిక మార్గంలో విషయాలను తెలుసుకోవడానికి డేటాను సేకరిస్తారు. వారు కంపెనీ వ్యవస్థను చట్టబద్ధంగా యాక్సెస్ చేస్తారు. గ్రే హ్యాట్ హ్యాకర్లు.. హ్యాకర్లు చట్టపరమైన అనుమతులతో పని చేస్తారు.
ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాలి. ఇందులో బీఎస్సీ, బీటెక్, బీఈ, బీసీఏ ఏదైనా చేయొచ్చు. డిగ్రీతో పాటు ఎథికల్ హ్యాకింగ్‌కు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (CEH), అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (OSCP). సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్ (CCNA), సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్ (CISA), కంప్యూటర్ హ్యాకింగ్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ (CHFI), అఫెన్సివ్ సెక్యూరిటీ వైర్‌లెస్ ప్రొఫెషనల్ (OSWP), సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ (CISM), సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CISSPsional) కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
ఎథికల్ హ్యాకింగ్ అనేది విద్యపై కాకుండా మీ నైపుణ్యాలు, అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది. ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి, కొన్ని ప్రాథమిక అవసరాలు తప్పనిసరిగా తీర్చాలి. ఎథికల్ హ్యాకర్లు.. పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, సైన్యం, చట్టపరమైన సంస్థలు, ప్రైవేట్ రంగంలో పని చేస్తారు. ఎథికల్ హ్యాకర్ సగటు జీతం రూ.5,01,191 వరకు ఉంటుంది. వ్యాపార రంగాన్ని డిజిటలైజేషన్ చేయడం వల్ల దాదాపు అన్ని కంపెనీల్లో ఎథికల్ హ్యాకర్ల అవసరం ఏర్పడింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..