ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 1038 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1038 ఖాళీలకు గాను.. ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా.. పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు రూ. 250 చెల్లించాలి. తెలంగాణలో మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలవగా, అక్టోబర్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను రాత పరీక్ష, టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..