ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని సంస్థలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Esic Jobs

Updated on: Apr 27, 2022 | 10:09 AM

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని సంస్థలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 218 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్, జనరల్‌ సర్జరీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డెంటల్‌ సర్జరీ డిగ్రీ/పీజీ/ఎండీ/డాక్టోరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ది రీజనల్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచదీప్‌ భవన్, సెక్టార్‌–16,ఎన్‌ఐటీ,ఫరీదాబాద్‌–121002, హర్యానా, డెంటల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ది రీజనల్‌ డైరెక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్, డీడీఏ కాంప్లెక్స్‌ కమ్‌ ఆఫీస్, థర్డ్‌ అండ్‌ ఫోర్త్‌ ఫ్లోర్‌ రాజేంద్ర ప్లేస్, రాజేంద్ర భవన్, న్యూఢిల్లీ–110008 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 11-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్‌ చేయండి..

Also Read: TRS Foundation Day Live: పింక్ సిటీగా మారిన భాగ్యనగరం.. తరలివస్తున్న గులాబీ దళం..

Watch Video: స్థానం మారినా.. అదృష్టంలో మాత్రం నో ఛేంజ్.. మరోసారి విఫలమైన విరాట్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..

Andhra Pradesh: హాల్ టిక్కెట్ చూపిస్తే “ఫ్రీ”గా ప్రయాణం.. విద్యార్థుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం