భారత ప్రభుత్వ రంగానికి చెందిన కలకత్తాలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 41 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, డిర్మటాలజీ, సైకియాట్రీ, బ్లడ్ బ్యాంక్, రేడియాలజీ, ఎమర్జెనీ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్‌డీ/ఎమ్‌ఎస్/డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 14, 15, 16 తేదీల్లో కింది అడ్రస్‌లో ఉదయం 9 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.225లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. జీతభత్యాలు కింది విధంగా ఉంటాయి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: DEAN OFFICE, Academic Block, 2nd Floor, ESIC MEDICAL COLLEGE, Joka, Diamond Harbour Road, Kolkata 700104.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.