BTech Academic Calendar 2025: బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీలకు తరగతులు ప్రారంభించుకునే తుది గడువును అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 14తో ఈ గడువు ముగియగా..

BTech Academic Calendar 2025: బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Btech First Year Academic Calendar

Updated on: Aug 18, 2025 | 8:00 PM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 18: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీలకు తరగతులు ప్రారంభించుకునే తుది గడువును అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 14తో ఈ గడువు ముగియగా.. దీనిని సెప్టెంబరు 15 వరకు పొడిగించింది. ఇప్పటికే తెలంగాణలో ఈఏపీసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ముగిసింది. ఈ క్రమంలో పలు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఈ రోజు (ఆగస్ట్‌ 18) నుంచి, మరి కొన్ని కాలేజీలు ఆగస్టు 25వ తేదీ నుంచి ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ప్రారంభించనున్నాయి.

ఇక బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సులో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు చెరి సగం సీట్లు కేటాయిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు కౌన్సెలింగ్‌లో ఎంపీసీ విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే బీఫార్మసీ కాలేజీలకు ఇప్పటివరకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. అనుమతులు వస్తే అటు బయోటెక్నాలజీ, ఇటు బీఫార్మసీ సీట్లను భర్తీ చేయాలని భావిస్తున్నారు. అందువల్ల బయో టెక్నాలజీ విద్యార్థులకు తరగతుల ప్రారంభ తేదీ ఇంకా వెల్లడించలేదు. బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చేరిన విద్యార్థులు బ్రాంచీలు మారేందుకు ఆగస్టు 18, 19వ తేదీల్లో అంతర్గత స్లైడింగ్‌కు అవకాశం ఇస్తారు. ఇందుకు ప్రస్తుతం వెబ్‌ ఆప్షన్ల నమోదు జరుగుతుంది. వీరికి ఆగస్ట్‌ 22లోపు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

ఇగ్నో 2025 ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన వెలువడించింది. తాజా ప్రకటన మేరకు ఆగస్టు 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందులో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.